- నటి ఫరియా అబ్దుల్లా వ్యాఖ్యలు
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న హనుమాన్ సినిమా చిన్న సినిమాగా మొదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి కొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో నటీనటులందరికీ మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ బ్లాక్‌బస్టర్ అవకాశాన్ని తానే మిస్ చేసుకున్నానని నటి ఫరియా అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఇప్ప్పుడు వైరల్ అవుతున్నాయి.తాజాగా తన కొత్త సినిమా గాయపడ్డ సింహం మే 1 విడుదలవుతున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఫరియా, తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. ’జాతిరత్నాలు’ తర్వాత ఇండస్టీల్రోకి వచ్చిన సమయంలో కథల ఎంపికపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ’హనుమాన’ వంటి మంచి ప్రాజెక్ట్‌ను కోల్పోయానని ఆమె తెలిపింది. ఆ సమయంలో స్క్రిప్ట్‌లను ఎలా అంచనా వేయాలో తెలియదు. మంచి కథను గుర్తించడంలో తప్ప్పు చేశాను. నిజం చెప్పాలంటే అప్ప్పుడు ఆలోచించకుండా ’నో’ చెప్పాను. ఇప్ప్పుడు సినిమా రిజల్ట్ చూసాక చాలా బాధగా ఉంది అంటూ ఫరియా తన మనసులోని మాటను బయటపెట్టింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జాలను ఎక్కడ కలిసినా ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటానని కూడా తెలిపింది. ఆ సమయంలో నిజంగా నాకు బ్రెయిన్ లేదు. బుద్ధిలేక నో చెప్పాను.. నిజానికి నాకు కథను ఎలా జడ్జ్ చేయాలో తెలియదు. ఇకపై కెరియర్లో కథలు ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తానని తెలిపింది. ఇక ఫరియా వదులుకున్న ఆ పాత్రను చివరకు అమృత అయ్యర్ దక్కించుకోగా, ఆ సినిమాతో ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇండస్టీల్రో ఒకరు వదులుకున్న అవకాశం మరొకరికి వరంగా మారుతుందనే విషయాన్ని ఈ ఉదాహరణ మరోసారి రుజువు చేసింది. ప్రస్తుతం ఫరియా తన ఆశలన్నీ ’గాయపడ్డ సింహం’ సినిమాపైనే పెట్టుకుంది. ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని తన కెరీర్‌కు కొత్త ఊపునివ్వాలని భావిస్తోంది.
