హీరో కిరణ్ అబ్బవరం వెల్లడి
Cinemag_masti (Movie News): హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కె. ర్యాంప్’ (K. R. A. M. P.) ఈ దీపావళికి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక గురువారం జరిగింది. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, “ఈ సినిమా ప్రారంభించినప్పుడే దీపావళికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే గొప్ప సినిమా అవుతుందని నమ్మాం. మేము ఊహించిన దానికంటే సినిమా అద్భుతంగా వచ్చింది. నన్నూ, మా టీమ్‌ని నమ్మండి. ఈ దీపావళి పండుగ ‘కె. ర్యాంప్’తో మరింత సరదాగా ఉంటుంది. ఇకపై నా అభిమానులు గర్వపడేలా సినిమాలు చేస్తా,” అని ధీమా వ్యక్తం చేశారు.
“మాపై నమ్మకంతో థియేటర్‌కు రండి, కడుపుబ్బా నవ్వించి తీరుతాం. ఒక్కొక్కడికి ‘బుర్రపాడు.. గుడ్డలు జారుడే’ అనేలా సినిమా ఉంటుంది. టికెట్ డబ్బులు వృథా అయ్యాయనే మాట రాదు,” అని ఆయన ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.
దర్శకుడు జైన్స్ నాని మాట్లాడుతూ, “సినిమా క్లైమాక్స్‌లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. మంచి సందేశం కూడా ఉంది. అన్ని వాణిజ్య అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కిరణ్ అబ్బవరం ఇంతకు ముందు ఎప్పుడూ చేయని సరికొత్త పాత్రను పోషించారు. మా ప్రచార చిత్రాల స్థాయిలోనే సినిమా కూడా ఉంటుంది,” అని తెలిపారు.
నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ, “ఈ సినిమాను కేవలం 47 రోజుల్లో కేరళలోని ఆహ్లాదకర వాతావరణంలో పూర్తి చేశాం. సెట్లో ప్రతి రోజూ నవ్వుకున్నాం. సెట్లో నవ్వుకున్న ఏ సినిమా కూడా విజయం సాధించడంలో గురి తప్పలేదు. ‘కె. ర్యాంప్’ కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నాం,” అని అన్నారు.
సీనియర్ నటుడు వి.కె. నరేశ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఈ సినిమా చూసిన తర్వాత మహేశ్ బాబు, అల్లు అర్జున్, నాని తర్వాత అందరూ కిరణ్ అబ్బవరం పేరే చెబుతారు. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన సంగీతం అందించారు. భవిష్యత్తులో జైన్స్ నాని పెద్ద దర్శకుడు అవుతాడు,” అని ప్రశంసించారు.
యుక్తి తరేజా కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మక్ నిర్మించారు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో దర్శకులు విజయ్ కనకమేడల, విఐ ఆనంద్, రామ్ అబ్బరాజు, సుబ్బు, నటుడు సాయికుమార్, హీరోయిన్లు విమలా రామన్, కామ్నా జెఠ్మలానీ, సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.
Hero Kiran Abbavaram’s Announcement – K- Ramp
Cinemag_masti (Movie News ): “When we decided to make this film, we immediately chose to release it for Diwali. We were confident it would be a movie that the entire family would enjoy together. The film turned out even better than we expected. Trust me and trust our film team. This Diwali festival will be even more fun with ‘K. R. A. M. P.’ Going forward, I will do films that make my fans proud,” said hero Kiran Abbavaram.
The film, directed by Jains Nani, stars Kiran Abbavaram as the hero and Yukti Thareja as the heroine. It is produced by Rajesh Danda and Shiva Bommak under the banners of Hasya Movies and Rudhransh Celluloid. The team held a pre-release event on Thursday ahead of the film’s release on October 18th.
He further added, “Come with faith in us, we will guarantee you an entertaining time filled with laughter. The film will leave everyone in the theatre saying ‘Bhurrapadu… Guddalu Jarude’ (Mind-blowing… clothes slipping off, an expression for ultimate entertainment). We won’t let you feel your ticket money was wasted.”
Director Jains Nani stated, “The film has a small twist in the climax and a good message. We have made it with all the commercial elements. Kiran Abbavaram’s characterization is entirely new; he has played a role he has never done before. The trailers have already built expectations among the audience, and the film will match that level.”
Producer Rajesh Danda shared, “We completed this film in 47 days, shooting in the pleasant atmosphere of Kerala. We laughed every day on the set. No film that made us laugh on set has ever failed to succeed. We are hopeful that ‘K. R. A. M. P.’ will also achieve a big victory.”
Veteran actor V. K. Naresh commented, “After watching this film, everyone will take Kiran’s name after Mahesh Babu, Allu Arjun, and Nani. Chethan Bharadwaj has given excellent music. Jains Nani will become a big director in the future.”
Directors Vijay Kanakamedala, V. I. Anand, Ram Abbaraju, Subbu, actor Saikumar, heroines Vimala Raman, Kamna Jethmalani, and music director Chethan Bharadwaj also participated in the event.
#KRAMP, #KiranAbbavaram, #JainsNani, #YuktiTareja, #DiwaliRelease, #FamilyEntertainer, #HasyaMovies, #RudhranshCelluloid, #Tollywood, #VKNaresh, #ChethanBharadwaj
