కావాలనే ఐటమ్ సాంగ్ చేశా: నిర్మొహమాటంగా చెప్పిన సమంత
Cinemag_masti ( Movie News) : ఇండస్ట్రీలో సమంత స్టార్ హీరోయిన్గా ఏ స్థాయికి ఎదిగిందో అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఆమె స్థానాన్ని అంత తేలికగా ఎవరూ భర్తీ చేయలేరని చెప్పవచ్చు. సాధారణంగా కొంతమంది హీరోయిన్లు తమ తప్పులను ఒప్పుకోవడానికి వెనుకాడతారు, కానీ సామ్ (సమంత) అలా కాదు. తాను తప్పులు చేశానని ఆమె బహిరంగంగా ఒప్పుకుంది.
ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో పాల్గొన్న సమంత తన మనసులోని భావాలను ఏ మాత్రం దాచుకోకుండా పంచుకుంది. తన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు తన జీవితంలో జరిగిన ప్రతి విషయం ప్రజలకు తెలిసే విధంగానే జరిగిందని, ఎన్ని ట్రోల్స్ వచ్చినా వాటిని ఎదుర్కొని నిలబడినట్లు ఆమె తెలిపింది. ప్రతి ఒక్కరికీ ఒక ఆశయం ఉండాలని, దానికి తగ్గ సదుద్దేశం కూడా తోడవ్వాలని సమంత నొక్కి చెప్పింది.
ఇక సామ్ కెరీర్‌ను మలుపు తిప్పిన విషయం ‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం. ఇది ఆమెపై ట్రోలింగ్‌ను మరింత పెంచింది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత బయట ఎక్కడా కనిపించని సామ్, ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ అనే పాటతో ప్రేక్షకులను పలకరించింది. అయితే, ఆ పాట చేయడం పూర్తిగా తన సొంత నిర్ణయమని సమంత స్పష్టం చేసింది. ఇప్పటివరకు మూస పాత్రలు పోషించి, కొత్తగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ సాంగ్ ఆఫర్ వచ్చిందని, ఐటమ్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనే ఉద్దేశంతోనే ఆ సాంగ్ చేసినట్లు తెలిపింది.
అదేవిధంగా, తన శరీర సౌందర్యం (బాడీ) గురించి మాట్లాడుతూ… తాను సెక్సీగా ఉంటానని తనకే అనిపించదని, అందుకే దర్శకులు కూడా తనకు బోల్డ్ రోల్స్ ఇవ్వలేదని సమంత చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు తన జీవితంలో ఎదురైన ఎదురుదెబ్బలను పాఠాలుగా గుర్తు చేసుకుంటూ, ముందుకు సాగుతానని ఆమె తెలిపింది. ప్రస్తుతం సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
“I Did the Item Song Intentionally”: Samantha Spoke Candidly
Cinemag_masti ( Movie News) : Everyone knows the level to which Samantha has risen as a star heroine in the industry. Although she has been away from films for some time, it can be said that no one can easily replace her position. While some heroines struggle to admit their mistakes, Sam (Samantha) is not like that; she openly admitted that she has made mistakes.
Participating in the NDTV World Summit, Samantha spoke her heart out without hiding any of her feelings. She stated that everything that happened in her life, from the beginning of her career until now, has happened publicly, and she stood firm against all the trolling she faced. Samantha emphasized that everyone should have a goal, and a good intention should accompany it.
The incident that changed Sam’s career was performing the item song in ‘Pushpa’. This further increased the trolling against her. Sam, who was not seen anywhere in public after her divorce from Naga Chaitanya, came before the audience with the song ‘Oo Antava.. Oo Oo Antava’. She clearly stated that it was entirely her decision to do that song. She mentioned that she had been doing stereotypical roles until then, and when she wanted to try something new, this song offer came her way. She revealed that she did the song just to see what it would be like to perform an item number.
Furthermore, speaking about her physique (body), Samantha confessed that she never felt she was sexy, which is why directors also did not offer her bold roles. She also stated that she will move forward, remembering the setbacks she faced in her life as lessons. Currently, Samantha’s comments have gone viral on social media.
#Samantha #SamanthaRuthPrabhu #OoAntava #Pushpa #ItemSong #NDTVWorldSummit #Trolling #Confession #StarHeroine #TeluguCinema #ActressLife #Viral
