Cinemag_masti ( Movie Update): మాస్ మహారాజా రవితేజకు సరైన హిట్ పడి చాలా కాలమైంది. చిరంజీవితో కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని రవితేజ చూడలేదు. అయినప్పటికీ, ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు.
అక్టోబర్ 31న రవితేజ 75వ చిత్రం ‘మాస్ జాతర’ విడుదల కానుంది. ‘ధమాకా’ తర్వాత ఈ సినిమాలో శ్రీలీల మరోసారి రవితేజతో జోడీ కట్టింది. ఇప్పటికే విడుదలైన పాటలు అలరిస్తున్నాయి. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇది యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందింది.
ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 76వ చిత్రాన్ని రచయిత కిషోర్ తిరుమల (నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, రెడ్ దర్శకుడు) డైరెక్ట్ చేస్తున్నారు. రవితేజ సరసన ఆషికా రంగనాథ్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు మొదట్లో ‘అనార్కలి’ అనే టైటిల్ అనుకున్నా, ఇప్పుడీ సినిమాకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పేరు పెట్టబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది ఫ్యామిలీ డ్రామా కాగా, రాబోయే సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలిచే అవకాశం ఉంది.
ఇక రవితేజ చేయబోతున్న 77వ చిత్రాన్ని శివ నిర్వాణ (‘నిన్ను కోరి’, ‘మజిలి’, ‘ఖుషీ’ దర్శకుడు) డైరెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం థ్రిల్లర్ డ్రామా జానర్‌కు చెందినది. ఇందులో రవితేజ తన వయసుకు తగ్గ పాత్ర పోషిస్తారని అంటున్నారు.
రవితేజ చేయబోతున్న 78వ సినిమాను కళ్యాణ్ శంకర్ (‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల దర్శకుడు) డైరెక్ట్ చేస్తాడని సమాచారం. నిజానికి ‘టిల్లూ క్యూబ్’కు దర్శకత్వం వహించాల్సి ఉన్నా, దానిని పక్కన పెట్టి ఇప్పుడు కళ్యాణ్ శంకర్, రవితేజతో కలిసి ఒక సూపర్ హీరో మూవీ చేయబోతున్నారట. ఇది ‘మాస్ జాతర’ తర్వాత నాగవంశీ రవితేజతో తీయబోయే మరో చిత్రం.
ఈ విధంగా రవితేజ వరుసగా నాలుగు డిఫరెంట్ జానర్స్తో సినిమాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రాలలో ఏవి రవితేజను తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకొస్తాయో చూడాలి.
#MassJathara, #RaviTeja75, #MassJatharaOnOct31, #SreeLeela, #BhanuBhagavarapu, #TeluguCinema, #Tollywood, #MassMaharaja, #RaviTeja