‘ద రాజాసాబ్’ విడుదల మరోమారు వాయిదా
Cinemag_masti (Moive News): ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘ద రాజాసాబ్’ చిత్రం పలుమార్లు విడుదల తేదీలను మార్చుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ తేదీ కూడా మారే అవకాశం ఉందని, సినిమా ఏకంగా సమ్మర్‌కు (వేసవికి) వాయిదా పడుతోందనే మరో చర్చ కోలీవుడ్‌లో నడుస్తోంది. దీంతో ప్రభాస్ అభిమానులు అయోమయంలో పడ్డారు. ఎందుకంటే, ఈ సినిమాతో పాటు ప్రభాస్ అంగీకరించిన ఇతర చిత్రాల పరిస్థితి ఏమిటనేది వారి గందరగోళానికి కారణం. అయితే, ప్రభాస్ ఒక పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళ్తున్నారని, కాబట్టి ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని సన్నిహిత వర్గాలు భరోసా ఇస్తున్నాయి.
‘ద రాజాసాబ్’ పోస్ట్‌పోన్ అవుతుందన్న వార్త వెనుక ఒక కారణం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ తమ నిర్మాణ సంస్థ ద్వారా ఇతర టాప్ స్టార్స్‌తో సినిమాలు తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా నిర్మిస్తానని అన్నారు. అంతేకాదు, పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా విడుదలైనప్పుడు, సూపర్‌హిట్ టాక్‌తో నడుస్తున్న తమ ‘మిరాయ్’ మూవీ షోస్‌ను ఎత్తేసి మరీ ‘ఓజీ’కి షోలు వేయడానికి విశ్వప్రసాద్ అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే రాబోయే సంక్రాంతి బరిలో చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం తమ ‘ద రాజాసాబ్’ను వాయిదా వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇక ప్రభాస్ సినిమాల ప్రణాళిక విషయానికొస్తే.. ‘ద రాజాసాబ్’ పూర్తి చేసిన వెంటనే, ఆయన హను రాఘవపూడి డైరెక్షన్లో తాను నటిస్తున్న ‘ఫౌజీ’ షూటింగ్లో పాల్గొంటారు. ఆ తరువాత నవంబర్‌లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ‘స్పిరిట్’ మూవీలో ప్రభాస్ నటించబోతున్నారు. ఈ రెండు సినిమాలలో ఒకటి 2026 ద్వితీయార్ధంలో, మరొకటి 2027లో విడుదలవుతాయని అంటున్నారు. ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ చిత్రాల తరువాత గతంలోనే అంగీకరించిన ‘కల్కి-2’, ‘సలార్-2’ చిత్రాలనూ ప్రభాస్ పూర్తి చేయవలసి ఉంది. వీటిలో ఓ సీక్వెల్‌ను 2026లోనే ప్రారంభిస్తారట. ఆ తరువాత 2027లో మరో సీక్వెల్‌కు ముహూర్తం పెడతారు. అంటే ఈ సీక్వెల్స్‌లో ఒకటి 2027లో విడుదలవుతుంది, మరొకటి 2028లో వస్తుందని తెలుస్తోంది. వీటితో పాటే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ప్రభాస్ ఓ మూవీ చేయనున్నారని కూడా సమాచారం. ఇదే కాకుండా, ‘ద రాజాసాబ్’ రిజల్ట్‌ను బట్టి ఆ సినిమాకు కూడా సీక్వెల్ చేసే యోచన ఉందని అంటున్నారు. ఇదే జరిగితే తెలుగునాట ప్రభాస్ ‘సీక్వెల్ స్టార్’గా గుర్తింపు పొందే అవకాశం ఉంది.
The Raja Saab Release Postponed Yet Again
‘The Raja Saab’ movie, starring Prabhas and directed by Maruthi under the People Media Factory banner with T.G. Viswa Prasad as the producer, has seen multiple changes to its release dates. Currently, there are reports that ‘The Raja Saab’ is set to arrive on January 9th as a Sankranti gift. However, another rumour suggests that even this date might change, and the film could be shifted entirely to the Summer season. This has caused confusion among Prabhas’ fans, who are worried about the status of the other films Prabhas has committed to. Nevertheless, close sources suggest that fans need not worry, as Prabhas is proceeding with a meticulous plan.
Some analysts suggest a specific reason behind the rumours of ‘The Raja Saab’ being postponed. The film’s producer, T.G. Viswa Prasad, is reportedly attempting to produce films with other top stars through his production house. As part of this, he announced a film with Pawan Kalyan. Furthermore, when Pawan Kalyan’s ‘OG’ was released, Viswa Prasad agreed to remove his own production, the super-hit running movie ‘Mirai’, to accommodate more shows for ‘OG’. Against this backdrop, there is speculation that he might be postponing ‘The Raja Saab’ from the upcoming Sankranti race to make way for ‘Mana Shankara Varaprasad Garu’, a film starring Chiranjeevi in the Anil Ravipudi combination.
Regarding Prabhas’ schedule, immediately after completing ‘The Raja Saab’, he will join the shooting of ‘Fauji’, directed by Hanu Raghavapudi. Following this, Prabhas is scheduled to star in ‘Spirit’, directed by Sandeep Reddy Vanga, in November. It is believed that one of these two films will be released in the second half of 2026, and the other in 2027. After ‘Fauji’ and ‘Spirit’, Prabhas also has to complete the previously committed sequels, ‘Kalki-2’ and ‘Salaar-2’. It is said that one sequel will start in 2026, and the other will be scheduled for 2027. This implies one sequel will be released in 2027 and the other in 2028. Additionally, there is information that Prabhas will also be doing a movie under the direction of Prasanth Varma. Moreover, there are talks about a potential sequel to ‘The Raja Saab’ depending on its result. If this happens, Prabhas might earn the title of ‘Sequel Star’ in the Telugu film industry.
#TheRajaSaab #Prabhas #Maruthi #ReleasePostponement #Sankranti2026 #SummerRelease #Fauji #Spirit #HanuRaghavapudi #SandeepReddyVanga #Kalki2 #Salaar2 #PrasanthVarma #TGViswaPrasad #TeluguCinema #ManashankaraVaraprasadGaru #Chiranjeevi