- పక్కా ప్రణాళికతో చిత్ర బృందం అడుగులు
అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తన సినిమాలతో పాన్ ఇండియా సహా… మరెన్నో సరికొత్త మార్కెట్లకి దారి వేశారు. ఆ దారి తెలుగు సినిమాలకు గత కొన్నేళ్లుగా రాచబాటగా మారింది. ’బాహుబలి’ సినిమాల తర్వాత జపాన్ సహా ఎన్నో దేశాల్లో తెలుగు సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఇప్ప్పుడు అదే తరహాలో మరిన్న దేశాల్లో వారణాసిని తీసుకెళ్లేలా దర్శకుడు రాజమౌళి ప్లాన్ వేస్తున్నారు. మార్కెట్‌ను పెంచుకోవడం లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్నారు. వారణాసి’ సినిమాతో మరిన్ని కొత్త మార్కెట్లనీ కొల్లగొట్టాలనే ప్రణాళికల్ని ఆ చిత్రబృందం సిద్ధం చేసింది. ముఖ్యంగా దక్షిణ అమెరికాతోపాటు, లాటిన్ అమెరికా దేశాల మార్కెట్‌పైన గురిపెట్టినట్టు తెలుస్తోంది. ’వారణాసి’ కథ కూడా పలు దేశాల్లో ముడిపడినది కావడం, కథానాయకుడు ప్రపంచాన్ని చుట్టే సాహసికుడు కావడంతో… మరిన్ని కొత్త దేశాలకు, కొత్త మార్కెట్లకీ ఈ సినిమాని తీసుకెళ్లాలనే ప్రణాళికలతో ’వారణాసి’ బృందం ఉంది. అందులో భాగంగానే ఇటీవల మెక్సికోలో జరిగిన కామిక్ కాన్‌లో సినిమాని ప్రచారం చేశారు. రాజమౌళి వీడియో సందేశంతోపాటు, ’వారణాసి’ తెరవెనక సన్నివేశాల్ని అందులో ప్రదర్శించారు. తదుపరి బ్రెజిల్‌తోపాటు మరిన్ని దేశాల్లోనూ ’వారణాసి’ సినిమాని ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవలే ఓ పాటని తెరకెక్కించారు. మే తొలి వారం
నుంచి హైదరాబాద్‌లోనే కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. కథానాయకుడు మహేశ్ ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.