ఈ నెల 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల
Cinemag_masti (Movie News) : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ (OG) సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 23 నుంచి ఈ చిత్రం ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది. “పదేళ్ల క్రితం ముంబైలో వచ్చిన తుఫాను… మళ్లీ తిరిగి వస్తున్నాడు” అంటూ సదరు సంస్థ స్ట్రీమింగ్ వివరాలను ప్రకటించింది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ తమ సోషల్ మీడియా వేదికగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలిపింది.
దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబరులో థియేటర్లలో విడుదలైంది. ఓజస్ గంభీరగా పవన్ కల్యాణ్ నటన అభిమానుల్లో జోష్ నింపింది. ఆయన లుక్స్, యాక్షన్, థమన్ అందించిన నేపథ్య సంగీతం సినీ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
సినిమా కథాంశం:
అనగనగా ఒక రాజు. అతనికి రక్షణగా నిలిచిన ఓ యోధుడు. కానీ, శత్రువుల ప్రార్థనలు ఫలించి ఆ యోధుడు పదేళ్లపాటు కన్నతండ్రి లాంటి రాజుకి దూరమవుతాడు. ఇదే అదనుగా శత్రుమూక చెలరేగిపోతుంది. ఆ రాజుని ఇబ్బందులపాలు చేసి, అతని రాజ్యాన్ని అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తుంది. రాజుకీ, రాజ్యానికీ కష్టం వచ్చిందని తెలిశాక ఆ యోధుడు మళ్లీ తిరిగొచ్చాడు. అతను వచ్చాక ఏం జరిగిందన్నదే ఈ కథ.
ఇందులో రాజు సత్య దాదా (ప్రకాశ్‌రాజ్) అయితే, ఆయనకి రక్షణగా నిలిచిన యోధుడే ఓజస్ గంభీర అలియాస్ ఓజీ (పవన్ కల్యాణ్). సత్య దాదానీ, ఆయన రాజ్యం లాంటి పోర్ట్‌ని కష్టాల పాలు చేసేందుకు వచ్చినవాడే ఓమి (ఇమ్రాన్ హష్మీ). క్రూరమైన మనస్తత్వమున్న ఓమిని ఓజీ ఎలా ఎదుర్కొన్నాడు? ఓమి వెనక ఎవరున్నారు? అసలు ఈ ఓజీ ఎవరు? అతనికీ జపాన్‌లోని సమురాయ్ వంశానికీ సంబంధం ఏమిటి? తన పేరు చెబితే ముంబై అండర్ వరల్డ్ ఎందుకు గడగడలాడిపోతుంది? పదేళ్ల తర్వాత కూడా మళ్లీ శత్రువుల్ని అదేస్థాయిలో భయపెట్టాడా లేదా? అన్నది మిగతా కథ.
Streaming on Netflix from the 23rd of this Month
The OTT release date for the movie ‘OG’, starring Power Star Pawan Kalyan, has been confirmed. The film will start streaming on ‘Netflix’ from the 23rd of this month. The streaming platform announced the details, stating, “The storm that came to Mumbai ten years ago… is returning again.” Netflix released a poster on their social media handle confirming the news, and announced that the gangster drama will stream in Telugu as well as several other languages.
The film, directed by Sujeeth, was released in theatres in September. Pawan Kalyan’s performance as Ojas Gambheera energized the fans. His looks, action, and the background music provided by Thaman thoroughly entertained movie lovers.
The Storyline:
Once upon a time, there was a King, and a warrior who stood as his protector. However, the enemies’ prayers bore fruit, and the warrior was separated from the King (who was like a father to him) for ten years. Seizing this opportunity, the enemy group ran rampant, troubling the King and attempting to turn his kingdom-like port into a hub for illegal activities. When the warrior learned that the King and the kingdom were in trouble, he returned. What happened after his return forms the rest of the story.
In this film, the King is Satya Dada (Prakash Raj), and the warrior who protected him is Ojas Gambheera a.k.a. OG (Pawan Kalyan). The one who came to trouble Satya Dada and his kingdom-like port is Omi (Emraan Hashmi). How did OG confront the cruel-minded Omi? Who is behind Omi? Who exactly is OG? What is his connection to the Samurai clan in Japan? Why does the Mumbai underworld tremble at the mention of his name? Did he manage to strike the same fear in his enemies even after ten years? That is the rest of the story.
#OGMovie #PawanKalyan #OGOnNetflix #Sujeeth #NetflixIndia #OTTRelease #GangsterDrama #OjasGambheera #EmraanHashmi #PrakashRaj #TeluguCinema #PanIndia
