Site icon cinemagmasti.fun

’ఓజి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

pavankalyan_og_movie
  • పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన భారీ చిత్రం ’ఓజి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారైంది.

Cinemag_masti (OTT News):  సాహో ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌ గా నటించగా, బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ విలన్‌ గా నటించాడు. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబరు 25న వరల్డ్‌ వైడ్‌ గా రిలీజ్‌ అయింది. ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతూ ఇప్పటికీ థియేటర్స్‌ లో రన్‌ అవుతోంది. ఇప్పటి వరకు వరల్డ్‌ వైడ్‌ గా రూ. 310 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసింది.

ఇంతటి సంచలనం సృష్టించిన ‘ఓజి’ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ ను రిలీజ్‌ కు ముందే భారీ ధరకు కొనుగోలు చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌. ఇప్పుడు తమ ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేసేందుకు డేట్‌ ఫిక్స్‌ చేసింది. ఈ నెల 23 నుండి నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కు రానుంది ఓజి. 28 రోజుల థియేటర్‌ రన్‌ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌ కు వస్తోంది. తెలుగు, తమిళ్‌, మలయాళం, కన్నడతో పాటు హిందీలోను డిజిటల్‌ రిలీజ్‌ కాబోతుంది. థియేటర్స్‌ లో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి వ్యూస్‌ రాబడుతుందో చూడాలి.

 

#OGMovie, #PawanKalyan, #Sujeeth, #PriyankaMohan, #ImranHashmi, #Netflix, #OGOnNetflix, #Tollywood, #TeluguCinema, #OTTRelease, #PanIndiaFilm

Exit mobile version