- శుక్రవారం ఉదయం తన ఎక్స్ వేదికగా విడుదల
Cinemag_masti (Movie News : తమిళ అగ్ర హీరో శిలంబరసన్ టీఆర్ అలియాస్ శింబు, జాతీయ అవార్డు గ్రహీత, క్రియేటివ్ జీనియస్ వెట్రిమారన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘అరసన్’ (తమిళం). ఈ చిత్రం తెలుగులో ‘సామ్రాజ్యం’ పేరుతో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రోమోను యంగ్ టైగర్ ఎన్టీఆర్ శుక్రవారం ఉదయం తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా విడుదల చేశారు.
ఇంకా షూటింగ్ పూర్తిస్థాయిలో ప్రారంభం కాని ఈ చిత్రం ఉత్తర చెన్నై నేపథ్యంతో కూడిన గ్యాంగ్‌స్టర్ కథతో రూపొందుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో 4 నిమిషాలకు పైగా నిడివితో చాలా **’రా అండ్ రస్టిక్’**గా ఉంది. హత్య నేరంపై కోర్టుకు వచ్చిన హీరో, జడ్జి ముందు “నాకేమీ తెలియదు, నన్ను ఇరికించారు” అని చెబుతూనే… మరోవైపు ఒక యువ హీరో ముగ్గురిని నరికి చేతులు కడుక్కునే సన్నివేశాలను ఇందులో చూపించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది.
ప్రోమో ఆరంభంలో ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఎంట్రీ, అతనితో హీరో శింబు మాట్లాడే డైలాగులు హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా, “నా స్టోరీని ఎవరితో చేపిద్దామనుకుంటున్నారు… ఎన్టీఆర్‌తో చేపించండి, కుమ్మేస్తాడు” అని శింబు చెప్పే డైలాగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
గతంలో వెట్రిమారన్, ధనుష్ కాంబోలో వచ్చిన ‘వడ చెన్నై’ సినిమా యూనివర్స్‌లో ఒక భాగంగా ఈ చిత్రాన్ని తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కథానాయికలుగా సమంత, కీర్తి సురేశ్, సాయి పల్లవిలలో ఇద్దరు నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Jr. NTR Releases ‘Samrajyam’ Promo
Cinemag_masti (Move News): The film ‘Arasan’ (Tamil), starring leading Tamil hero Silambarasan TR alias Simbu and directed by National Award-winning creative genius Vetrimaaran, will be released in Telugu as ‘Samrajyam’. Young Tiger Jr. NTR officially launched the film’s promo this Friday morning via his ‘X’ (formerly Twitter) account.
Though the full-fledged shooting for this gangster film set in North Chennai has not yet commenced, it is already generating significant buzz. Anirudh Ravichander is composing the music. The recently released promo is over four minutes long and has a very ‘raw and rustic’ feel. The promo presents contrasting scenes where the hero, brought to court on a murder charge, tells the judge, “I don’t know anything, I was framed,” while simultaneously showing the young hero brutally hacking three people and washing his hands. The background score is impressive.
The entry of ‘Jailer’ director Nelson Dilipkumar at the start of the promo and the dialogues he exchanges with Simbu are a highlight. Specifically, Simbu’s dialogue, “Who are you thinking of having tell my story? Get NTR to do it, he will absolutely smash it,” is attracting a lot of attention from fans.
It is understood that this film is being brought as a part of the universe of ‘Vada Chennai,’ the previous hit film from the Vetrimaaran-Dhanush collaboration. Furthermore, it is rumored that two of the three heroines—Samantha, Keerthy Suresh, and Sai Pallavi—might star in the film.
#Samrajyam, #Arasan, #Simbu, #STR, #SilambarasanTR, #Vetrimaaran, #JrNTR, #Anirudh, #VadaChennai, #GangsterFilm, #TeluguCinema, #Kollywood, #PromoLaunch, #Samantha, #KeerthySuresh, #SaiPallavi