Site icon cinemagmasti.fun

సరోగసీ నేపథ్యంలో తెలుసు కదా మూవీ | Telusu kada

telusu kada movie

సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ మూవీ రివ్యూ

Cinemag_masti (Movie Review):  ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ విజయాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘జాక్’ చిత్రం నిరాశపరచడంతో, కాస్త జాగ్రత్తగా ఎంచుకున్న సినిమా ‘తెలుసు కదా’. నీరజ కోన దర్శకురాలిగా పరిచయమైన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కృతి కలిసి నిర్మించారు.

కథా నేపథ్యం:

వరుణ్ (సిద్ధు జొన్నలగడ్డ) ఒక అనాథ. అతని బాల్య స్నేహితుడు అభి (వైవా హర్ష). సొంత కుటుంబం ఉండాలని కలలు కనే వరుణ్‌కు తన ప్రమేయం లేకుండానే ఒక బ్రేకప్ జరుగుతుంది. ఆ తర్వాత అంజలి (రాశీ ఖన్నా)ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లయిన కొన్ని నెలలకే అంజలికి పిల్లలు పుట్టరని తెలుస్తుంది. దాంతో వారు సరోగసీ ద్వారా పిల్లలను కనాలని నిర్ణయించుకుంటారు. ఇందుకోసం రాగా కుమార్ (శ్రీనిధి శెట్టి) అనే డాక్టర్ ముందుకు వస్తుంది. వరుణ్, అంజలికి తాను సరోగసీ ద్వారా బిడ్డను కంటానని చెబుతుంది. అయితే వరుణ్ అంగీకరించాడా? వరుణ్‌కు, రాగాకు మధ్య గతంలో పరిచయం ఉందా? ఆ పరిచయాన్ని ఎందుకు అంజలికి దాచిపెట్టారు? దాని పరిణామాలు ఏంటి? అనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఇది సాధారణ ముక్కోణపు ప్రేమకథలా అనిపించినా, కథనం కాస్త భిన్నంగా ఉంది. ముక్కోణ ప్రేమకథ కంటే, పెళ్లైన యువకుడి జీవితంలో సరోగసీ మదర్‌గా మాజీ ప్రేయసి ప్రవేశిస్తే ఎలాంటి విచిత్ర సంఘటనలు జరుగుతాయనే అంశంపై నీరజ కోన ఈ కథను అల్లుకున్నారు. తొలి సగం ఆసక్తికరంగా సాగినా, రెండో సగంలో వరుణ్ నిజాన్ని బయటపెట్టిన తర్వాత సినిమా వేగం తగ్గిపోయింది. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు కథ మొత్తం ‘లవ్ అండ్ హేట్’ రిలేషన్‌షిప్‌ చుట్టూ తిరుగుతూ సాగింది. మూడు ప్రధాన పాత్రల్లో ఎవరికి వారు తమ నిర్ణయమే సరైనదని భావించినా, ప్రేక్షకుడికి మాత్రం ఎవరి పక్షాన నిలబడాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. సినిమా మొత్తం కేవలం నాలుగు పాత్రల చుట్టూనే తిరగడం కొందరికి బోర్‌గా అనిపించవచ్చు. ద్వితీయార్థంలో డ్రామాను పక్కన పెట్టి, కేవలం డైలాగుల మీదే కథను నడిపే ప్రయత్నం చేసింది దర్శకురాలు. తీవ్రమైన భావోద్వేగాలు పండించాల్సిన చోట, పైపై సన్నివేశాలతో సినిమా ముగిసింది.

నటీనటుల పనితీరు:

లైఫ్‌ను చిల్ అవ్వాలనుకునే కేర్-ఫ్రీ అమ్మాయిగా శ్రీనిధి శెట్టి బాగా నటించింది. రాశీ ఖన్నా పాత్ర హుందాగా ఉన్నా, సెకండాఫ్‌లోని ట్విస్ట్‌లు, టర్న్‌లను వ్యక్తం చేయడంలో లోపం కనిపించింది. హీరో స్నేహితుడిగా వైవా హర్ష నటన కొంత రిలీఫ్ ఇచ్చింది. అతని పాత్రే సినిమాలో కొంత వినోదాన్ని పండించింది. మిగిలిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు.

 

Siddu Jonnalagadda’s ‘Telusu Kada’ Movie Review

Cinemag_masti (Movie Review):  After delivering back-to-back hits with ‘DJ Tillu’ and ‘Tillu Square’, Siddu Jonnalagadda was disappointed by the result of his film ‘Jack’. Taking a cautious approach, he then starred in the movie ‘Telusu Kada’. The film marks the directorial debut of Neeraja Kona and is produced by TG Vishwa Prasad and his daughter Krithi.

The Story:

Varun (Siddu Jonnalagadda) is an orphan whose childhood friend is Abhi (Viva Harsha). The two grow up together. Since childhood, Siddu dreams of having a family of his own. After a breakup that happens without his direct involvement, Varun dutifully marries Anjali (Raashii Khanna). A few months after the wedding, Varun and Anjali discover that Anjali cannot have children. They decide to opt for surrogacy. Dr. Raga Kumar (Sreenidhi Shetty) steps forward, offering to be the surrogate mother for Varun and Anjali’s baby. Does Varun agree? Did Varun and Raga know each other previously? Why did they hide their past connection from Anjali? What are the consequences of their secret? That forms the rest of the story.

Analysis:

There is no shortage of love triangles in cinema, with many such films releasing every year. While this is a similar romantic comedy, the core subject is somewhat different. More than a love triangle, the story is based on the strange events that occur in a young man’s life after marriage, specifically when his ex-girlfriend enters their lives as a surrogate mother.

Neeraja Kona wrote this story revolving around the premise of the complications that arise when an ex-girlfriend enters a newlywed couple’s life as a surrogate mother. While the first half is engaging, the film’s pace slows down significantly after Varun reveals the truth in the second half. From that point until the climax, the narrative revolves entirely around a ‘love and hate’ relationship. While each of the three main characters believes their decision is correct, the audience in the theatre won’t be able to side with any one of them. The entire film revolving around just four main characters can become monotonous. In the second half, Director Neeraja Kona tried to drive the movie with dialogues, sidelining the dramatic elements. The film proceeds with superficial scenes in places that required intense emotional depth.

Performances:

Sreenidhi Shetty performed well as the care-free girl who wants to chill in life. Raashii Khanna’s character is dignified, but there was a noticeable lack in her expression of the twists and turns in the second half. Viva Harsha provided some relief as the hero’s friend, and his character brought some much-needed entertainment to the film. The remaining three or four characters are fleeting and lack significance.

#TelusuKada, #SidduJonnalagadda, #NeerajaKona, #RaashiiKhanna, #SreenidhiShetty, #VivaHarsha, #TeluguMovieReview, #RomCom, #Surrogacy, #Tollywood, #NewRelease

Exit mobile version