Cinemag_masti (Movie Update) : మలయాళీ నటి అనుపమా పరమేశ్వరన్ తన సినీ వేగాన్ని పెంచింది. గత రెండు, మూడేళ్లుగా సెట్స్‌పై ఉన్న ఆమె సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి. దీంతో ఈ ఏడాది అనుపమా నటించిన మొత్తం ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినట్టు అయ్యింది.
ఈ ఏడాది ఇప్పటికే ఆమె నటించిన నాలుగు చిత్రాలు విడుదల కాగా, తాజాగా గురువారం ఒక మలయాళ చిత్రం, శుక్రవారం ఒక తమిళ చిత్రం విడుదలవుతున్నాయి.
ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రదీప్ రంగనాథన్ సరసన అనుపమా నటించిన ‘డ్రాగన్’ (తెలుగులోనూ విడుదలైంది) వచ్చింది. ఆ తర్వాత మలయాళ చిత్రం ‘జానకి వి. వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ విడుదలైంది. అనుపమా ఎంతో ఇష్టపడి చేసిన ‘పరదా’ సినిమాను ‘సినిమా బండి’, ‘శుభం’ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ కాడ్రేగుల రూపొందించారు. విడుదలకు ముందు బజ్ క్రియేట్ చేసినా, ఈ సినిమా ఆశించినంత ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో అనుపమా భావోద్వేగానికి గురవ్వడం అప్పట్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఈ ఏడాది వచ్చిన అనుపమా నాలుగో చిత్రం ‘కిష్కింధపురి’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో గతంలో ‘రాక్షసుడు’లో నటించిన ఆమె, మళ్లీ వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో కలెక్షన్స్ రాబట్టకపోయినా, ఓటీటీలో మంచి స్పందన దక్కించుకుంది.
తాజాగా దీపావళి కానుకగా అనుపమా నటించిన మలయాళ చిత్రం ‘ది పెట్ డిటెక్టివ్’ గురువారం (నిజానికి గత ఏడాదే విడుదల కావాల్సింది) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక శుక్రవారం ఆమె నటించిన తమిళ చిత్రం ‘బైసన్’ విడుదల కాబోతోంది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో, సీనియర్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ‘బైసన్’ తెలుగు వెర్షన్ ఒక వారం తర్వాత అక్టోబర్ 24న విడుదల కానుంది.
గతంలో మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ‘పరియేరుమ్ పెరుమాళ్’లో తనకు అవకాశం వచ్చినా వినియోగించుకోలేకపోయానని, ఇప్పుడు మరోసారి ఆయన సినిమా ‘బైసన్’లో ఛాన్స్ దక్కడం ఆనందంగా ఉందని అనుపమా చెబుతోంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏదైనా అనుపమాకు మెమరబుల్ హిట్‌ను అందిస్తుందేమో చూడాలి.
#AnupamaParameswaran #ThePetDetective #BisonMovie #BisonKaadhal #DhruvVikram #MariSelvaraj #Tollywood #Kollywood #MalayalamCinema #NewReleases #DeepavaliRelease #CinemaUpdate