Site icon cinemagmasti.fun

వరుసగా రెండు సార్లు

rashmika madanna

జోరు కొనసాగిస్తోన్న రష్మిక

Cinemag_masti (Movie News):  ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో రష్మిక మందణ్ణ జోరు కనిపిస్తోంది. గతేడాది చివర్లో ‘పుష్ప 2’తో బాక్సాఫీస్‌ బరిలో మెరుపులు మెరిపించిన ఈ నాయిక, ఈ ఏడాది ఇప్పటికే ‘ఛావా’, ‘కుబేర’ చిత్రాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడామె కేవలం రెండు వారాల వ్యవధిలోనే వరుసగా రెండు సినిమాలతో సినీప్రియుల్ని మురిపించేందుకు సిద్ధమవుతోంది.

ప్రస్తుతం ఆమె.. ఆయుష్మాన్‌ ఖురానాతో జంటగా ఆదిత్య సర్పోత్దార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బహుభాషా చిత్రం ‘థామా’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ముంజ్యా’, ‘స్త్రీ 2’ విజయాల తర్వాత మడాక్‌ హారర్‌ యూనివర్స్‌ నుంచి వస్తున్న కొత్త సినిమా కావడం, ఇందులో రష్మిక బేతాళ ప్రపంచానికి సుందరిగా కనిపించనుండటం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి ఈ చిత్రంతో ఆమె మరో విజయాన్ని అందుకుంటుందా? లేదా? తెలియాలంటే ఈ నెల 21 వరకు వేచి చూడక తప్పదు.

ఈ సినిమా విడుదలైన మరో రెండు వారాలకే ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’గా మరో విభిన్నమైన చిత్రంతో రష్మిక సినీప్రియుల్ని పలకరించనుంది. ఇది ఆమెకు తొలి నాయికా ప్రాధాన్యమున్న సినిమా. రాహుల్‌ రవీంద్రన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో దీక్షిత్‌ శెట్టి హీరోగా నటించారు. భావోద్వేగాలతో నిండిన ఆహ్లాదకరమైన ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. ఇటీవలే విజయ్‌ దేవరకొండతో లవ్‌ ట్రాక్‌లో ఉన్న రష్మిక సినిమాల పరంగా జోరు కొనసాగిస్తోంది.


Rashmika Continues Her Winning Streak

Currently, Rashmika Mandanna’s dominance is visible across the Pan-India level. After lighting up the box office late last year with ‘Pushpa 2’, this year she has already registered consecutive successes with ‘Chhaava’ and ‘Kubera’. Now, she is preparing to delight movie lovers with two back-to-back films, just two weeks apart.

She is first set to appear in the multilingual film ‘Thaama’, starring opposite Ayushmann Khurrana and directed by Aditya Sarpotdar. The fact that this is a new movie from the Maddock Horror Universe, following the successes of ‘Munjya’ and ‘Stree 2’, and that Rashmika will be seen as the beauty of the ‘Baitaal’ (Vampire) world, is raising curiosity among everyone. To know whether she will score another success with this film, one must wait until the 21st of this month.

Just two weeks after the release of ‘Thaama’, Rashmika will greet movie lovers with another distinct film, ‘The Girlfriend’. This is her first female-centric film. Directed by Rahul Ravindran, the film stars Dheekshith Shetty as the hero. This pleasant love story, filled with emotions, is set to release on November 7th. Rashmika, who was recently linked in a love-track with Vijay Deverakonda, is certainly continuing her momentum in films.


#RashmikaMandanna #Thaama #TheGirlfriend #PanIndia #DiwaliRelease #HorrorComedy #FemaleCentricFilm #AyushmannKhurrana #RahulRavindran #DheekshithShetty #Pushpa2 #Chhaava #Kubera #MaddockHorrorUniverse #CinemaUpdate

Exit mobile version