Site icon cinemagmasti.fun

లవ్ స్టోరీ బాగనే తీసిండు

kirana Abbavam

Cinemag_masti (Moive Review):  ఏం లేదు మావా..  గీ పోరడు కిరణ్‌ అబ్బవరం గాడు ఉన్నడు కదా, వీడు అస్సలు ఆగకుంట వరుసపెట్టి సినిమాలు చేసుకుంట పోతున్నడు. గిదేంది మామ! హిట్టయినా ఫట్టయినా పట్టిచ్చుకుంటలేడు. ఇండస్ట్రీలకి వచ్చి ఐదేండ్లే అయింది, కానీ పది సినిమాలు చేసి పారేసిండు. కథలు మంచిగనే తీసుకుంటండు గానీ, ఏందో అచ్చిరావడం లేదు. పోయినేడు ‘క’ తో మంచి హిట్టందుకున్నడు, కానీ దాని తర్వాత ‘దిల్‌రుబా’ తోని మొఖం మాడ్చుకున్నడు.

ఇగ ఇప్పుడైతే ‘కె-ర్యాంప్‌’ అని వచ్చిండు. యుక్తి తరేజా అని ఈమె హీరోయిన్‌. జైన్స్‌ నాని అనేటోడు డైరెక్ట్ చేసిండు. దీపావళికి శనివారం నాడు రిలీజ్ చేసిండ్రు.

అసలు కథ ఏంటిదంటే..

గిప్పుడు గీ పోరడు  కుమార్‌ అబ్బవరం (కిరణ్‌ అబ్బవరం) ఉన్నడు కదా,  వాల్ల నాయిన పెద్ద బిజినెస్‌మేన్‌ సాయికుమార్‌ ఒక్కగానొక్క ముద్దుల కొడుకు. సదువు సక్కగ అబ్బక పోయేసరికి , అల్లరి ఎక్కువైందని చెప్పి కేరళలో ఒక కాలేజీలో జాయిన్‌ చేస్తడు వాల్ల నాయిన. గక్కడో పోరి మెర్సీ జాన్‌ (యుక్తి తరేజా) ను ఫస్ట్‌ లుక్‌లోనే చూసి లవ్వుల పడ్తాడు. ఆ పోరికి లైఫ్‌ అంతా తోడుంటానని మాటిస్తడు.

ఆ మెర్సీ ఎవలో ఏందో తెలుసుకోకుండానే లవ్వుల పడ్తడన్నట్టు.. గానీ..  ఆ పోరికి ఏదో సమస్య ఉంటది. దాంతోని ఈ కుమార్‌ గాడు మస్తు గోస పడుతుండు. అసలు ఆ జాన్‌కున్న ప్రాబ్లం ఏంది? గవాల్లి ద్దరు కలిసిన్రా లేదా? తీటపురుగైన కుమార్‌ గానకి  గవాల్ల  అయ్య వాల్యూ ఎట్ల తెలిసిద్ది ? గిదే సినిమా స్టోరీ.

సినిమా స్టోరీ చూస్తే రోటీనే ఉంటది. చదువురాని పోరగాడు, లవ్వు, దాని తర్వాత వచ్చే చిక్కులు. కానీ గిట్ల కాదు మామ అని. ఈ ప్రేమకథలో చిక్కంతా.. అమ్మాయితోనో, ఆమె ఫ్యామిలీతోనో కాదు, గా పోరికి గింత పిచ్చి ఉంటదట. దాన్ని ఈ  పోరడు ఎట్ల పరిష్కరించిండు,  వాని లవ్వును ఎట్ల నిలబెట్టుకున్నడు అనేది డైరెక్టర్ మంచి మస్కా కొట్టి ఎంటర్‌టైన్‌మెంట్‌ యాంగిల్‌లో చూపిచ్చిండు.

అయితే గీ సైన్మాల ఏ లాజిక్కులు వెతకొద్దు అని డైరెక్టరే ఫస్ట్ చెప్పిండు. నిజానికి ఇది లాజిక్కులు లేకున్నా నవ్వుకోడానికి తీసిన సినిమాయే. ఫస్టాఫ్‌ అంతా కాలేజీ, లవ్వు, హీరోయిన్‌ ప్రాబ్లం రివీల్‌ చేయడంలో అట్ల ఇట్ల సాగింది. సెకండాఫ్‌ నుంచి మంచిగా స్పీడందుకుంది.

నరేశ్‌ మామ ట్రాక్ రచ్చ రచ్చే!

ఫస్టాఫ్‌, సెకండాఫ్‌ రెండింటిలోనూ నరేశ్‌ మామ మీద తీసిన ట్రాక్‌ థియేటర్ల ఇరగబడి నవ్వుతరు. నిజం చెప్పాల్నంటే ఆ ట్రాక్‌ నరేశ్‌ మామ రియల్‌ లైఫ్‌కు కూడా కనెక్ట్ అయ్యేటట్లు ఉంటది. గందుకే  ఇంక ఎక్కువ పండింది. సెకండాఫ్‌లో కామెడీతో పాటు క్లైమాక్స్‌లో మంచి ఎమోషన్ ఉండడం వల్ల.. బయటికొచ్చేటోడు మస్తు ఫీల్‌తోని వస్తడు. ఇక హీరోయిన్‌కు, హీరో తండ్రికి సంబంధించిన సీన్లు కూడా కొంచెం ఏడుపు తెప్పిస్తయి. డబుల్ మీనింగ్ డైలాగ్ లు కూడా చాల్నే ఉన్నయ్.  ఆకరుకు ఆ గా పోరీ కి ఉన్న పిచ్చి సమస్యకు ఇచ్చిన సొల్యూషన్‌ కూడా కన్విన్సింగ్‌గా అనిపిస్తది.

ఎవలెవలు ఎట్ల చేసిండ్రంటే ?

ఏ గోల్‌ లేకుంట అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడి క్యారెక్టర్‌లో కిరణ్‌ అబ్బవరం బాగానే చేసిండు. మొదలు పెట్టింది మొదలు లాస్ట్‌ వరకు కుమార్‌ రోల్‌ను మంచిగ పట్టుకున్నడు. భుజాలు కదుపుతూ ఒక కొత్త మేనరిజం మెయింటైన్ చేసిండు గీ సైన్మలా , అదైతే ఎలివేషన్‌ లెవెల్లో ఉంది. మెర్సీ జాన్‌ క్యారెక్టర్‌లో యుక్తి తరేజా కూడా బాగా చేసింది. అనుకున్న టైమ్‌కి పని కాకపోతే గగ్గోలు పెట్టే డిజార్డర్‌ ఉన్న పోరిగా మంచిగనే మెప్పించింది. మస్తు గ్లామర్‌గా  ఉంది, హీరోతో కెమిస్ట్రీ కూడా బాగా పండింది. నరేశ్‌ ఎప్పటిలెక్కనే తన పని తాను చూసుకున్నడు. ఆయన క్యారెక్టర్‌కు రాసిన సెటైర్లు, కామెడీకి పల్లికిలించ కుండా ఉండలేరు. మంచి ఎమోషనల్‌ సీన్లు కూడా నరేశ్‌ మామా మీద  పడ్డయి. హీరో తండ్రిగా సాయి కుమార్‌ డీసెంట్‌ రోల్‌ లో మంచిగానే చేసిండు. మురళీధర్‌ గౌడ్‌ పెదనాన్న పాత్రలో ఇమిడిపోయిండు. వెన్నెల కిశోర్‌ కొద్దిసేపే కనిపించినా బాగా రచ్చ చేసిండు. కెమెరా పనితనం బాగుంది. కేరళ విజువల్స్‌ను బాగా చూపించిండ్రు. చేతన్‌ భరద్వాజ్‌ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ క్లైమాక్స్‌లో రఫ్ఫాడిచ్చింది. రొటీన్‌ లవ్వు స్టోరీనే అయినా, డైరెక్టర్‌ నాని డీల్‌ చేసిన పద్ధతి బాగా అనిపించింది. వినోదం, ఎమోషన్స్‌ను కలిపి సినిమా తీసిన ఈ స్టైల్‌ అందరినీ మెప్పిస్తది అనచ్చు.


A Fun-Filled Love Story: Kiran Abbavaram’s ‘K-Ramp’

The hero Kiran Abbavaram continues to do back-to-back films, regardless of success or failure. In the five years since he entered the industry, he has completed ten films. Although his choice of stories is good, something seems to be missing. Last year, Kiran scored a super hit with ‘K’, but faced a massive failure with his subsequent film ‘Dilruba’. Now, he has arrived with ‘K-Ramp’.

Starring Yukti Thareja as the heroine, directed by Jains Nani, and produced by Rajesh Danda and Shiva Bommak, the film was released on Saturday as a Diwali gift.

The Story:

Kumar Abbavaram (Kiran Abbavaram) is the pampered son of a big businessman, Krishna (Sai Kumar). His father enrolls him in a college in Kerala because he is not keen on studies and is roaming around aimlessly. There, in the very first glance, Kumar falls in love with Mercy John (Yukti Thareja). He vows to be her lifelong companion. Kumar, who fell in love without knowing who Mercy is or what her background is, faces difficulties due to a problem his lover has. What exactly is John’s problem? Did the two unite? Did the wayward Kumar realize the value of his father? This is the story of the movie.

A story of an uneducated young man, his love, and the subsequent complications is a routine plot. However, the problem in this love story is not with the girl or her family, but with a mental disorder the girl has. The director showed how the hero solved it and saved his love with an entertainment angle. The director seems to have hinted early on not to look for logic.

To be honest, this film was made to be enjoyed without seeking logic. The first half, featuring the college, the romance, and the revelation of the heroine’s problem, proceeded at a moderate pace. The second half picked up speed. The track filmed on Naresh in both the first and second halves brought laughter to the theatres. In fact, this track was even more effective as it was connectable to Naresh’s real life. The second half, which includes comedy along with emotion in the climax, ensures that the audience leaves the theatre with a good feeling. The scenes involving the heroine and the hero’s father evoke emotional depth. There are also plenty of adult jokes. However, the solution shown for the heroine’s mental disorder at the end is convincing.

Cast Performance & Technical Team:

Kiran Abbavaram performed well in the role of a young man who is aimless and spends his time in mischief. He did justice to the character of Kumar from start to finish. In this film, he maintained a new mannerism of shaking his shoulders, which acted as an elevation. Yukti Thareja also did a great job in the role of Mercy John. She impressed as a girl with a disorder, who appears normal but creates a ruckus if things don’t go her way on time. She looked glamorous and created good chemistry with the hero. Naresh delivered as usual. Nobody would fail to laugh at the satires and comedy tracks written for his character. In addition to the comedy, he also got good emotional scenes. Sai Kumar played a decent and convincing role as the hero’s father and a businessman. Muralidhar Goud fit well as the heroine’s paternal uncle. Vennela Kishore created a riot even though he appeared only for a short time. Satish Reddy Masam’s cinematography is good. He has captured the visuals of Kerala well. Music director Chetan Bharadwaj’s background score elevated the climax sequences. The songs were good and visually appealing. The director’s treatment of the routine love story is good. Overall, Jains Nani’s approach to making the film by blending entertainment and emotions is sure to entertain everyone.


#KRamp #KiranAbbavaram #YuktiThareja #JainsNani #SaiKumar #Naresh #TheatricalReview #TeluguMovie #Tollywood #ComedyDrama #LoveStory #DiwaliRelease #ChethanBharadwaj #VennelaKishore

Exit mobile version