Site icon cinemagmasti.fun

రుక్మిణిగా ఆఫియా సయ్యద్‌.. కృష్ణుడిగా నితిన్‌!

afia_sayyad

డిసెంబర్‌ 4న థియేటర్లలోకి ‘అలియాస్‌ రుక్మిణి’
నాని సమర్పణలో ప్రేమ, హాస్యం, భావోద్వేగాల సందడి!

నితిన్‌ కెరీర్‌లో మరో వైవిధ్యమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ‘అలియాస్‌ రుక్మిణి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నేచురల్‌ స్టార్‌ నాని సమర్పణలో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి ఆఫియా సయ్యద్‌ కథానాయికగా నటిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తాజాగా విడుదలైన ఆమె పాత్ర పరిచయ గ్లింప్స్‌ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇందులో ఆఫియా ఓ కఠినమైన పాఠశాల ఉపాధ్యాయురాలు రుక్మిణిగా కనిపించనున్నారు. విద్యార్థుల దృష్టిలో ఆమె ఓ రాక్షసి.. హిట్లర్‌.. హోంవర్క్‌ పోలీస్‌! బోర్డుపై తన పేరు రుక్మిణి అని రాస్తూ, విద్యార్థులవైపు తీక్షణంగా చూసే ఆమె తీరు గ్లింప్స్‌లో ప్రత్యేకంగా నిలిచింది. మహాభారతంలోని రుక్మిణి పాత్రను గుర్తుచేసేలా కథానాయిక పాత్రను తీర్చిదిద్దగా, నితిన్‌ పాత్రకు కృష్ణుడు అనే పేరు పెట్టడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. పేర్లలోనే ఇంత ప్రత్యేకత ఉంటే.. తెరపై ఈ ఇద్దరి మధ్య ఎలాంటి రసవత్తరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది సినీ అభిమానుల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. ‘ధండోరా’తో గుర్తింపు తెచ్చుకున్న మురళీకాంత్‌ దేవసోత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి ఘంటా యూనానిమస్‌ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్నారు. జోమోన్‌ టీ. జాన్‌ ఛాయాగ్రహణం అందిస్తుండగా, విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. తొలి గ్లింప్స్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోనే మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ 4న థియేటర్లలోకి రానుంది. మరి కృష్ణుడి అల్లరి.. రుక్మిణి గాంభీర్యం కలిసి వెండితెరపై ఎలాంటి వినోదాన్ని పంచుతాయో చూడాలి!

Exit mobile version