Site icon cinemagmasti.fun

యశ్ టాక్సిక్ విడుదల మరోమారు వాయిదా

Taxic

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న హై`వోల్టేజ్ యాక్షన్ చిత్రం టాక్సిక్ మరోసారి వాయిదా పడింది. విడుదల తేదీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మొదట ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయాలని ప్లాన్ చేసిన మేకర్స్, తర్వాత జూన్ 4కి వాయిదా వేశారు. అయితే ఇప్ప్పుడు ఆ తేదీకి కూడా సినిమా విడుదల కావడం లేదని యష్ స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగపూరితమైన ప్రకటన విడుదల చేశారు. సినిమా కాన్ ఈవెంట్‌లో ’టాక్సిక’కు వచ్చిన అంతర్జాతీయ స్పందనతో తమ బాధ్యత మరింత పెరిగిందని యష్ తెలిపారు. భారతీయ సినిమాను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టేలా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. షూటింగ్ పూర్తయినప్పటికీ, ప్రస్తుతం గ్లోబల్ డిస్టిబ్యూషన్, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై పని జరుగుతోందని వెల్లడించారు. అందుకే త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఇక ఈ వాయిదా వెనుక మరికొన్ని కారణాలు కూడా ఉన్నట్లు ఇండస్టీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓటీటీ హక్కులపై చర్చలు కొనసాగుతున్నాయి. ఒక ప్రముఖ సంస్థ రూ.110 కోట్లు ఆఫర్ చేయగా, నిర్మాతలు మాత్రం కనీసం రూ.250 కోట్లు ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ డీల్ ఇంకా ఖరారు కాకపోవడం కూడా ఆలస్యానికి కారణమైందని తెలుస్తోంది. అలాగే కొన్ని ప్యాచ్ వర్క్ పనులు ఇంకా పూర్తికాకపోవడం, సెన్సార్ పక్రియ ప్రారంభం కాకపోవడం కూడా వాయిదాకు దారితీసిన అంశాలుగా చెబుతున్నారు. అంతేకాకుండా పశ్చిమాసియాలో ఉన్న అనిశ్చిత పరిస్థితులు గ్లోబల్ రిలీజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మేకర్స్ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం ఇతర ప్రాజెక్టుల పనుల్లో బిజీగా ఉండటంతో, పూర్తి స్థాయిలో ప్రమోషన్లపై దృష్టి సారించేందుకు సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కన్నడతో పాటు తెలుగు సహా ఆరు భాషల్లో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ’టాక్సిక’, భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించే చిత్రంగా నిలుస్తుందని యష్ నమ్మకం వ్యక్తం చేశారు. విడుదల ఆలస్యమైనా, బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version