Site icon cinemagmasti.fun

‘మైసా’ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతం | Maisa Movie

rashmika_mandana

Cinemag_masti (Move News):  నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న పవర్‌ఫుల్, ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ మూవీ ‘మైసా’. ఈ చిత్రంతో రవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను పాన్-ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా, మేకర్స్ ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ను ప్రకటించారు. నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రానికి సంగీతం అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్‌ను ‘మైసా’ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా, జేక్స్ బిజోయ్ ట్రైబల్ వాయిద్యాలతో రీరికార్డింగ్ చేస్తున్న ఒక వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సౌండింగ్ అద్భుతంగా ఉండటంతో, ‘మైసా’ సంగీతపరంగా గ్రాండ్ స్కేల్‌లో ఉండబోతుందని స్పష్టమవుతోంది.

‘మైసా’ గోండు తెగల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న హై-ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రంలో రష్మిక మందన్న ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ అవతార్‌లో కనిపించనుంది. సూర్య ‘రెట్రో’ సినిమాకు పనిచేసిన శ్రేయాస్ పి. కృష్ణ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ ఫేమ్ ఆండి లాంగ్ యాక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు.

Jakes Bejoy to Compose Music for Rashmika Mandanna’s ‘Maiza’

Cinemag_masti (Move News):  National Crush Rashmika Mandanna is starring in the powerful, female-centric action movie ‘Maiza’. The film marks the directorial debut of Ravindra Pulle and is being produced by Unformula Films on a massive budget for a pan-India release. The film is currently being shot at a brisk pace.

The makers recently released an interesting update, announcing that renowned music director Jakes Bejoy—known for his work on Nani’s ‘Saripodhaa Sanivaaram’—has been chosen as the music director for ‘Maiza’.

To celebrate the announcement, the team released a video featuring Jakes Bejoy doing a re-recording session using tribal instruments. The sound quality suggests that the music for ‘Maiza’ is set to be on a grand scale.

‘Maiza’ is described as a high-octane emotional action thriller set against the backdrop of the Gond tribes. Rashmika Mandanna is expected to be seen in an intense avatar never before witnessed. Shreyas P. Krishna, who worked on Suriya’s ‘Retro,’ is handling the cinematography, while Andy Long of ‘Kalki 2898 AD’ fame is designing the action sequences.

#Maiza, #RashmikaMandanna, #JakesBejoy, #RavindraPulle, #PanIndia, #FemaleCentric, #ActionThriller, #GondTribe, #UnformulaFilms, #Tollywood, #Kollywood, #NewUpdate

Exit mobile version