- సోషల్ మీడియాలో పుకార్లు..
Cinemag_masti (Movie News ): ‘బలగం’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు వేణు, తన తదుపరి చిత్రం **’ఎల్లమ్మ’**ను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన హీరో ఎంపికపై గత ఏడాదిన్నరగా చర్చలు జరుగుతున్నాయి. నాని, నితిన్, శర్వానంద్, నిఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి పలువురు హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కథానాయికలుగా సాయి పల్లవి, కీర్తి సురేశ్లలో ఒకరిని ఎంచుకునే విషయంపైనా వార్తలు నడిచాయి.
అయితే, తాజాగా ఈ సినిమా హీరోగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) పేరు తెరపైకి రావడం సినీ ప్రేమికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హల్చల్ చేస్తోంది. అంతేకాకుండా, ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాదే సంగీతం కూడా అందించనున్నట్లు సమాచారం. డ్యాన్స్, నటనలో ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్‌కు అద్భుతమైన ప్రతిభ ఉంది.
అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మేకర్స్, దర్శకుడు వేణు, దిల్ రాజు లేదా దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా స్పందిస్తేనే దీనిపై పూర్తి క్లారిటీ వస్తుంది.
ఇదిలావుంటే, గతంలో ‘కుమారి 21ఎఫ్’ సినిమా సమయంలో తన ఎస్వీసీ బ్యానర్లో సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్‌ను హీరోగా పరిచయం చేస్తానని దిల్ రాజు మాట ఇచ్చారు. దశాబ్దకాలం గడిచినా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ‘ఎల్లమ్మ’ చిత్రంతో వేణు, డీఎస్పీ ఇద్దరినీ కలిపి సినిమా తీస్తే, దిల్ రాజు ఇచ్చిన మాట కూడా నెరవేరినట్లే అవుతుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా, ‘ఎల్లమ్మ’ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వస్తుందో వేచి చూడాలి.
Social Media Goes Viral: DSP to be the Hero of ‘Balagam’ Venu’s ‘Ellamma’?
Cinemag_masti (Move News): Director Venu, who achieved super success with the film ‘Balagam’, is reportedly preparing to direct his next movie, ‘Ellamma’. The film is being produced by Dil Raju, but the search for the lead hero has been ongoing for over a year and a half. Several names, including Nani, Nithiin, Sharwanand, Nikhil, and Bellamkonda Srinivas, were previously discussed. Similarly, reports have suggested that discussions for the heroine role were primarily between Sai Pallavi and Keerthy Suresh.
However, the latest news has surprised cine-lovers: music director Devi Sri Prasad (DSP) is now being considered for the lead role. This news is currently creating a huge buzz on social media. Furthermore, it’s also rumored that DSP will compose the music for the film. DSP already possesses great talent in both dancing and acting.
As of now, there has been no official announcement regarding these reports. Clarity on this matter will only come when the makers, director Venu, Dil Raju, or Devi Sri Prasad officially respond.
Meanwhile, there’s an ongoing industry talk: Dil Raju had previously promised to launch Devi Sri Prasad as a hero under his SVC banner, directed by Sukumar, back during the ‘Kumari 21F’ period. However, a decade has passed, and that project hasn’t materialized. The current buzz is that by making ‘Ellamma’ with Venu and DSP, Dil Raju would be fulfilling his long-standing promise. Everyone is now waiting to see what official news emerges regarding the ‘Ellamma’ movie.
#Ellamma #DeviSriPrasad #DSP #BalagamVenu #DilRaju #Tollywood #NewMovie #HeroDSP #Kumari21F #SocialMediaBuzz #TeluguCinema